Saturday, November 23, 2024
HomeTrending Newsకార్గిల్ లో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు

కార్గిల్ లో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు

సైనిక బలగాల్లో మహిళల ప్రాతినిధ్యంతో దేశ రక్షణ రంగం మరింత పటిష్టమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. రక్షణ రంగంలో సంస్కరణలు…సైన్యంలోకి శాశ్వత ప్రాతిపదికన మహిళలలు కూడా రావటం ద్వారా దేశ సైనిక శక్తి తిరుగులేనిది అవుతుందని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది కూడా దీపావళి వేడుకలను సైనికులతోనే జరుపుకుంటున్నారు. ఇందుకోసం ఆయన కశ్మీర్‌ సరిహద్దుల్లోని కార్గిల్‌కు చేరుకున్నారు. ప్రధానికి సైనికులు ఘన స్వాగతం పలికారు. సైనికులకు ప్రధాని మోడీ స్వీట్లు పంచి శుభాకాంక్షలు చెప్పారు. “ఉగ్రవాదానికి ముగింపు పలికే పండుగ”గా దీపావళిని అభివర్ణించారు మోదీ.

కార్గిల్‌ చేరుకున్న ప్రధాని మోదీ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. కాగా, 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోదీ.. సరిహద్దుల్లోని సైనికులతో కలిసి ప్రధాని హోదాలో తొలి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఏటా ఒక్కో సరిహద్దు ప్రాంతానికి వెళ్లి అక్కడ సైనికులను ఉత్సాహపరుస్తూ సంబరాల్లో పాల్గొంటున్నారు.

గతేడాది జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లో సైనికులతో కలిసి మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈసారి కార్గిల్‌లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. మీతో ఉండటం కంటే మంచి దీపావళి ఉండదని సైనికులను ఉద్దేశించి ప్రధాని అన్నారు. జవాన్లతో దీపావళి జరుపుకోవడాన్ని ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నానని అన్నారు. వందేమాతరం నినాదాలు చేస్తూ సైనికులను ప్రధాని ఉత్సాహపరిచారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్