రాష్ట్రాల్లో బిజెపి యేతర ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఆ పార్టీ నేతలు అక్రమాలకూ ఒడిగడుతున్నారని అమ్ ఆద్మీ పర్తే నేతలు ఢిల్లీలో ఆరోపించారు. బిజెపి విధానాలతో దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని ఆప్ నేతాలు ఘాటుగా విమర్శించారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేందుకు బీజేపీ ఆధ్వర్యంలో ఆపరేషన్ లోటస్ జరుగుతోందని అమ్ ఆద్మీ నేత, రాజ్య సభ సభ్యుడు సంజయ్ సింగ్ ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణలో ఆపరేషన్ లోటస్ జరుగుతోందన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని, వందలు, యాభై, ఇరవైఐదు కోట్ల రూపాయల ఆఫర్ చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, బీజేపీకి తెలంగాణలో కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. టీఆర్ఎస్ కు 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే ప్రయత్నాం స్పష్టంగా తెలుస్తోందని, బీజేపీ దళారులు ఢిల్లీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని సంజయ్ సింగ్ ఆరోపించారు. 43మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు… వారిని సంప్రదింపులు జరుపుతున్నామని అడియోలో చెప్తున్నారు బీజేపీ కిడ్నాపింగ్ గ్యాంగ్ గా మారింది. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మెఘాలయ, గోవా, మాహారాష్ర్ట వంటి రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ప్రభుత్వాలను కూల్చారని ఆరోపించారు. దేశం మొత్తంలో బీజేపీ కిడ్నాప్ గ్యాంగ్ అధ్యర్యంలో ప్రభుత్వాలను కూల్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇలా చేసే బదులు దేశంలో ఎన్నికలను రద్దు చేయండి. అడియోలో అమిత్ షా పేరు కూడా పేర్కొనడం జరిగిందన్నారు. పార్టీలో ప్రముఖ వ్యక్తి బీఎల్ సంతోష్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. కేంద్ర హోంశాఖ మంత్రి నేతృత్వంలో కిడ్నాపింగ్ గ్యాంగ్ నడుస్తోందని, కేంద్ర హోంశాఖ మంత్రే ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటే ఇంత కన్నాఘోరం ఇంకేముందన్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షాను తొలగించాలని సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో 43మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు తెచ్చిన డబ్బును ఎక్కడ దాచాడో తేలాలి. సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు మా జేబులో ఉన్నాయని బీజేపీ దళారులు అడియోలో చెబుతున్నారని, 104మంది ఎమ్మెల్యేల బలం ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ముగ్గురు దళారులు పట్టుబడ్డారు… ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి. గతంలో ఢిల్లీలో జరిగిన ఆపరేషన్ లోటస్ ను విఫలం చేశామన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్వర్యంలోనే ఆపరేషన్ లోటస్ జరుగుతోంది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అణిచేవేసే వారికి పాలించే అర్హత లేదు… బీజేపీ ప్రభుత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గెలవలేని చోట కిడ్నాపింగ్ గ్యాంగ్ ను దింపి ఎమ్మెల్యేలను కొంటున్నారు. ఈ రకంగా ఉంటే దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యాం ఎలా బ్రతుకుతుంది.? కేంద్ర మంత్రిగా అమిత్ షాకు బాధ్యత లేదా? ఆపరేషన్ లోటస్ లో బీజేపీ పెద్దలు, అమిత్ షా, బీఎల్ సంతోష్ ఇతరుల పాత్ర తేలాల్సిందేనని సంజయ్ సింగ్ అన్నారు.