Sunday, November 24, 2024
HomeTrending Newsబిజెపి నేతల వ్యాఖ్యలకు... పూనమ్ కౌర్ స్ట్రాంగ్ కౌంటర్

బిజెపి నేతల వ్యాఖ్యలకు… పూనమ్ కౌర్ స్ట్రాంగ్ కౌంటర్

రాహుల్ గాంధీ చేస్తున్న ‘భారత్ జోడో యాత్ర’లో తెలంగాణలో సాగిన యాత్రలో సినీ నటి పూనమ్ కౌర్ పాల్గొన్నారు. ఈ యాత్రలో రాహుల్ గాంధీ, పూనమ్ కౌర్ చేయిపట్టుకుని నడుస్తున్న ఫొటోపై చర్చ జరుగుతోంది. ఈ ఫొటోపై బీజేపీ నేత ఒకరు సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశంపై చర్చ సాగుతోంది.

బీజేపీ మద్దతుదారు, కార్యకర్త అయిన ప్రీతి గాంధీ ట్విటర్‌లో ఈ ఫొటోను షేర్ చేస్తూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆయన తాత అడుగుజాడల్లో నడుస్తున్నారు’ అంటూ రాహుల్ గాంధీని, ఫొటోలో ఉన్న పూనమ్‌ కౌర్‌ను, రాహుల్ గాంధీ తాత అయిన జవహర్‌లాల్ నెహ్రూను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.. ఎడ్వినా మౌంట్‌బాటన్‌తో నెహ్రూ సంబంధం గురించి కూడా అభ్యంతరకరమైన సందేశాలను సోషల్ మీడియాలోను, వాట్సాప్‌లోను షేర్ చేస్తున్నారు.

Poonam Kaur Rahul Gandhi
నెహ్రూను గురించి ఈ ప్రచారంలో రాహుల్ గాంధీని కూడా కలపటానికి ప్రీతి గాంధీ తన ట్వీట్ ద్వారా ప్రయత్నించారు. ఇలా చేయటాన్ని సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలు సహా పలువురు ప్రముఖులు తప్పుపట్టారు.

ప్రీతి గాంధీ చేసిన ఈ ట్వీట్‌ వేలాదిగా రీట్వీట్లు, షేర్లు అయింది. చాలా మంది ఆమె వ్యాఖ్యను ఖండిస్తూ పోస్టులు పెట్టారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళలతో కలిసివున్న ఫొటోలను కాంగ్రెస్ మద్దతుదారులు, సాధారణ ప్రజలు షేర్ చేస్తూ ప్రీతి గాంధీ ట్వీట్‌కు రిప్లై ఇస్తున్నారు.

Poonam Kaur Rahul Gandhi

”ఈ దాడి రాహుల్ గాంధీ మీద కాదు. ఆ మహిళ వ్యక్తిత్వం మీద. ఈ దాడి బీజేపీ చేస్తోందని అంటున్నారు. సిగ్గుచేటు ప్రీతి గాంధీ” అని కాంగ్రెస్‌కు చెందిన రియా ట్వీట్ చేశారు.

శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేస్తూ.. ”పురుషులతో భుజం భుజం కలిపి, చేయి చేయి కలిపి మహిళలు నడవటం దేశాన్ని బలోపేతం చేస్తుందని, ముందుకు నడిపిస్తుందనేది మీ ఉద్దేశమైతే.. పండిట్ నెహ్రూ ఒక్కరి ఆకాంక్ష మాత్రమే కాదు, బాబాసాహెబ్ అంబేడ్కర్, ఇతర స్వాతంత్ర్య సమరయోధుల కలలు కూడా నెరవేరుతాయి” అని వ్యాఖ్యానించారు.

”మహిళల విషయంలో బీజేపీ ఆలోచన ఎందుకు మారటం లేదో నాకు అర్థం కావటం లేదు” అని కాంగ్రెస్ నేత ఆకాష్ శర్మ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్ ట్వీట్ చేస్తూ.. ”అవును, రాహుల్ గాంధీ తన ముత్తాత అడుగుజాడల్లో నడుస్తూ దేశాన్ని ఏకం చేస్తున్నారు. ఇదికాక, మీ చిన్నప్పటి వేదనలు బాగా లోతుగా ఉన్నాయి. మీ చెడు ఆలోచనలను చూపుతున్నాయి. ప్రీతి మీకు చికిత్స అవసరం” అని ఎద్దేవా చేశారు.

”మోదీ మద్దతుదారుగా మీకు రాహుల్ గాంధీ అంటే పడకపోవచ్చు. కానీ ఒక మహిళ అయి ఉండీ ఒక మహిళ గురించి ఇలా ఆలోచించటం? రాహుల్‌తో ఈ యువతి ఫొటోలో మీరు అంత చెడ్డ విషయం ఏం చూశారు? మీ అన్నతమ్ముళ్లు, అక్కచెల్లెళ్లు కూడా నెహ్రూ తన చెల్లెలు, మేనకోడలితో ఉన్న ఫొటోలను అసభ్యకర వ్యాఖ్యలతో వైరల్ చేస్తారు” అని జర్నలిస్ట్ అజిత్ అంజుమ్ ట్వీట్ చేశారు.

Poonam Kaur Rahul Gandhi

పూనమ్‌కౌర్ కూడా ప్రీతి గాంధీ వ్యాఖ్యపై స్పందించారు.

”ఇది చాలా అవమానకరం. ప్రధానమంత్రి ‘నారీశక్తి’ గురించి మాట్లాడటం మీకు గుర్తుందా? నేను జారి పడబోయినపుడు రాహుల్ గారు నా చేయి పట్టుకున్నారు” అని ఆమె ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

దానికి ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ ఫొటోను ట్వీట్ చేస్తూ.. ”ఇలాంటి యాత్రలో ఎవరైనా వచ్చి పాలుపంచుకోవచ్చు. ప్రజల సమస్యలను వినటం, బలమైన, మెరుగైన భారతదేశాన్ని నిర్మించటం, సంభాషణను కొనసాగించటం మా లక్ష్యం” అని పేర్కొంది.

ఆ ఫొటో ట్వీట్‌ను పూనమ్ కౌర్ షేర్ చేస్తూ.. ”మహిళల పట్ల రాహుల్ గాంధీ ఆదరణ, గౌరవం, వైఖరి నా గుండెను తాకింది. చేనేత కార్మికుల సమస్యల గురించి విన్నందుకు రాహుల్ జీకి చేనేత కార్మికులతో పాటు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా” అని ట్వీట్ చేశారు.

Poonam Kaur Rahul Gandhi

పూనమ్ కౌర్ కొంతకాలంగా చేనేత, చేతివృత్తులపై సోషల్ మీడియాలో రాయటంతో పాటు ఫొటోలు షేర్ చేస్తున్నారు.

Also Read : ధరణి రద్దు చేస్తాం  రాహుల్ గాంధి

RELATED ARTICLES

Most Popular

న్యూస్