శరీరానికి తొడుక్కుని గాలిలో ప్రయాణించే జెట్ సూట్/ జెట్ ప్యాక్ లు వాణిజ్య విక్రయాలకు సిద్ధంగా ఉన్నాయి. యుకె కు చెందిన గ్రావిటీ అనే స్టార్టప్ సంస్థ 5 కిమీ దూరం ఎగురుతూ వెళ్లే జెట్ సూట్ ను తయారు చేసి అన్ని భద్రతా పరీక్షల్లో పాసైంది. అమెరికాలో వీటి వినియోగానికి అనుమతి కూడా లభించింది. విమాన ఇంధనం, డీజిల్ తో కూడా నడిచే జెట్ సూట్ ఫుల్ ట్యాంక్ ఫ్యూయల్ తో 34 కిలోల బరువుంటుంది.
ప్రస్తుతం దీని ధర రూ.3.25 కోట్లుంది. అమ్మకాలు పెరిగితే ధర తగ్గొచ్చు. గరిష్ఠ వేగం 80 కిమీ . సాధారణ ప్రయాణాలకు కాకుండా యుద్ధ క్షేత్రంలో మిలటరీ అవసరాలకు, యాంబులెన్సు సేవలు, పర్వతారోహకులను రక్షించడానికి జెట్ సూట్ బాగా ఉపయోగపడుతుందని గ్రావిటీ సంస్థ చెబుతోంది. దీన్ని కొనుగోలు చేయాలంటే ముందు రెండు రోజుల శిక్షణ అవసరం. దీనికి రూ.2.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చువుతుంది.