బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’… ఈ మూడు చిత్రాలు ఒకదాన్ని మించి మరోటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి. దీంతో బాలయ్యను ఎలా చూపించాలో ఈ జనరేషన్ డైరెక్టర్స్ లో బోయపాటి తెలిసినంతగా మరెవరికీ తెలియదు అంటున్నారు సినీ జనాలు. దీంతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి మరో సినిమా చేస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. 2024 ఎన్నికల టైమ్ కి ఈ క్రేజీ కాంబినేషన్లో పాలిటికల్ మూవీ రానుందని వార్తలు వస్తున్నాయి.
ఈ కాంబోని మరోసారి తెర పై చూసే అవకాశం త్వరలోనే దక్కబోతోందని తెలిసింది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. రామ్ తో బోయపాటి పాన్ ఇండియా మూవీ రూపొందిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ సెట్స్ పైకి వచ్చింది. ఇది అటు రామ్, ఇటు బోయపాటి ఇద్దరికీ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమాలో ఓ స్పెషలాఫ్ అట్రాక్షన్ కూడా ఉందని… అది బాలయ్య అని.. ఆయన గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి బాలయ్యతో బోయపాటి సంప్రదింపులు కూడా జరిపాడని, బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఓ కీలకమైన ఘట్టంలో… బాలయ్య ఎంట్రీ ఉంటుందని – ఈ సీన్ సినిమా మొత్తానికే హైలెట్ కానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే.. ఈ మూవీకి మరింత క్రేజ్ రావడం ఖాయం. మరి.. ప్రచారంలో ఉన్న వార్తల పై త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.