Saturday, June 13, 2026
HomeTrending Newsమునుగోడులో పోలింగ్ ప్రారంభం

మునుగోడులో పోలింగ్ ప్రారంభం

మునుగోడు ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకున్నది. అభ్యర్థుల భవితవ్యం తేల్చే పోలింగ్ ఈ రోజు ఉదయం 7 నుంచి ప్రారంభమైంది. ఉదయం 9.30 గంటల వరకు 11 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుండగా, ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చండూరులోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి బుధవారం రోజే ఎన్నికల సిబ్బంది సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉప ఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. 298 పోలింగ్ స్టేషన్లలో 2,41,855 మంది ఓటు  హక్కు వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన రాజకీయ పార్టీల ఘర్షణల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. పోలింగ్ తీరును రాచకొండ కమిషనరేట్ నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలను నల్లగొండకు తరలించి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపర్చనున్నారు.

పారదర్శకంగా పోలింగ్ జరిగేందుకు ఈసీ కసరత్తు. ఉప ఎన్నిక నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకున్న ఈసీ అధికారులు వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తోంది. వోటు హక్కు వినియోగించుకునే వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈసారి కొత్తగా డిజిటల్ స్లిప్పులు ఓటు వినియోగానికి గుర్తింపు కార్డు తప్పనిసరి చేశారు.

ఉప ఎన్నిక వివరాలు ..

మొత్తం ఓటర్లు 2,41,855

పురుషులు 1,21,720

స్త్రీలు 1,20,128

ప్లయింగ్ స్క్వాడ్,స్టేట్ సర్వేలైన్స్ టీమ్ లు 14

పోలింగ్ కేంద్రాలు 298

వీడియో సర్వేలైన్స్ టీమ్లు 14

సమస్యాత్మక కేంద్రాలు 105

మైక్రో అబ్జర్వర్లు 199

ఈవీఎంలు 1192, వీవీ ప్యాట్లు596,

కంట్రోల్ యూనిట్లు 596

పోలీస్ సిబ్బంది 3,365

చెక్ పోస్టులు 100

ఒక్కో కేంద్రంలో ఈవీఎంలు 3

కేంద్ర బలగాలు 15 కంపెనీలు

మరోవైపు బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అధికార పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన Mla ,mlc ,ministers ఇంకా మునుగొడులో నే వున్నారు వారిని అక్కడి నుంచి బయటకు పంపకుండా పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆర్వో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన రాజగోపాల్ రెడ్డి.

Also Read:దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular