Friday, March 29, 2024
Homeసినిమావాల్తేరు వీరయ్య ఏం చేస్తున్నాడో తెలుసా...?

వాల్తేరు వీరయ్య ఏం చేస్తున్నాడో తెలుసా…?

చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మూవీ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన శృతిహాసన్ నటిస్తుంది. బాబీ చిరంజీవి వీరాభిమాని కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తగట్టు ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ సినిమా పై అంచనాలను రెట్టింపు చేసింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ మూవీ అప్ డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇంతకీ ‘వాల్తేరు వీరయ్య‘ లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రస్టింగ్ సాంగ్ ను హైదరాబాద్ శివారులో భారీగా వేసిన ఒక సెట్ లో చిత్రీకరిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. సినిమాకు ఈ పాట చాలా ప్రత్యేకంగా నిలుస్తుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సాంగ్ స్పెషాలిటీ ఏంటంటే.. ఈ మూవీలో చిరంజీవితో పాటు కీలక పాత్రలో రవితేజ కూడా నటిస్తున్నారు. ఆయన టాకీ పార్ట్ ఇప్పటికే పూర్తి చేశాడు. చిరంజీవి, రవితేజ కాంబోలో ఒక పాట ఉంటుందని తెలిసింది.

అయితే… ప్రస్తుతం భారీ ఎత్తున రూపొందిస్తున్న పాట అదేనా..?  కాదా..? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. వాల్తేరు వీరయ్యగా చిరంజీవి లుక్ ను చూసి ఆయన వింటేజ్ లుక్ చూసినట్లుగా ఉందంటున్నారు అభిమానులు. ఒక ‘గ్యాంగ్ లీడర్’.. ఒక ‘ముఠా మేస్త్రీ’ సినిమాలో చిరంజీవిని చూసినట్లుగా వాల్తేరు వీరయ్యలో కనిపిస్తున్నారంటూ ఫ్యాన్స్ మాత్రమే కాదు సామాన్య జనాలు కూడా మాట్లాడుకుంటుండడం విశేషం. మరి.. వాల్తేరు వీరయ్యగా చిరంజీవి బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

Also Read: వీరయ్యతో పోటీకి సై అంటున్న బాలయ్య.

RELATED ARTICLES

Most Popular

న్యూస్