Wednesday, April 16, 2025
HomeTrending Newsఎఫ్.డి.సి. ఛైర్మన్ గా పోసాని

ఎఫ్.డి.సి. ఛైర్మన్ గా పోసాని

ఏపీ ఫిలిం డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా సినీ నటులు పోసాని కృష్ణ మురళిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ నటుడు విజయ చందర్ ఇప్పటివరకూ ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఇటీవలే మరో సినీ నటుడు అలీని ప్రభుత్వం  ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా నియమించిన సంగతి తెలిసిందే.

పోసాని కృష్ణ మురళి గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. తనకు పదవులు వద్దని,జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన ధ్యేయమని ఆయన గతంలో చెప్పారు. సినిమా టికెట్ రెట్ల పెంపు విషయంలో ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు చెందిన పలువురు భేటీ అయిన సమయంలో పోసాని కూడా వారితో పాటు సిఎం జగన్ ను కలుసుకున్నారు.

వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆయన సేవలను పార్టీ కోసం వినియోగించుకోవాలని సిఎం జగన్ భావిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్  స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు.

Also Read: ప్రజల మద్దతు తప్పకుండా ఉంటుంది: జగన్ ధీమా

RELATED ARTICLES

Most Popular

న్యూస్