Friday, March 29, 2024
HomeTrending Newsఇజ్రాయెల్‌ పీఠం బెంజమిన్‌ నెతన్యాహుదే

ఇజ్రాయెల్‌ పీఠం బెంజమిన్‌ నెతన్యాహుదే

ఇజ్రాయెల్‌లో తాజా ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు(73) సారథ్యంలోని సంకీర్ణ కూటమి చరిత్రాత్మక విజయం దిశగా సాగుతోంది. ఈ కూటమిలో నెతన్యాహుకు చెందిన లికుడ్‌ పార్టీ, యూదు మతవాద పార్టీలు ఉన్నాయి. వామపక్ష మెరెట్జ్‌ పార్టీ గట్టి పోటీ ఇస్తున్నా 91 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికే 120 మంది సభ్యుల పార్లమెంట్‌లో 65 సీట్లు నెతన్యాహు కూటమికి దక్కాయి. దీంతో నేతన్యాహు ప్రధానమంత్రి అవటం ఖాయమైంది. అయితే పాలస్తీనా సమస్య మరింత చిక్కుముడిగా మారనుందని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.

ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాక గత నాలుగేళ్లలో దేశంలో ఏకంగా ఐదుసార్లు ఎన్నికలు జరిగాయి. తాజా ఫలితాలతో రాజకీయ సందిగ్ధానికి తెరపడనుంది. నెతన్యాహు పార్టీ పూర్తి మెజారిటీ సాధించే దిశగా చేరువైంది. ఆయన నేతృత్వంలోని కన్జర్వేటివ్‌ లికుడ్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రీపోల్‌ సర్వేలూ తేల్చాయి. 120 మంది సభ్యులు కలిగిన ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌(నెసెట్‌)లో అధికారం చేపట్టేందుకు 61 సీట్లు కావాలి. బెంజిమన్‌ నెతన్యాహు నేతృత్వం వహిస్తున్న కన్జర్వేటివ్‌ లికుడ్‌ పార్టీ 65 సీట్లు సాధించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్