Sunday, March 15, 2026
HomeTrending Newsపాత్రికేయులు వరదాచారి మృతి

పాత్రికేయులు వరదాచారి మృతి

సీనియర్ పాత్రికేయులు గోవర్ధన సుందర వరదాచారి అనారోగ్యంతో ఈ రోజు తుది శాస విడిచారు. 92 ఏళ్ళ వరదాచారి జర్నలిజం డిగ్రీతో పాత్రికేయ వృత్తిలోకి వచ్చిన కొద్ది మందిలో ఒకరు. నిజామాబాదు జిల్లా ఆర్మూర్ లో 1932 అక్టోబర్ 15 న జన్మించారు. వరదాచారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.  తెలుగు మీడియా రంగంలో భాష, పద ప్రయోగం విషయాల్లో వరదాచారి ఎంతో మంది జర్నలిస్టులకు బోధన చేశారు.

పాత్రికేయులు జీ.ఎస్. వరదాచారి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లా కు చెందిన వరదాచారి నాలుగు దశాబ్దాల పాటు జర్నలిజం రంగానికి సేవలందించారని సీఎం అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular