Saturday, June 13, 2026
HomeTrending Newsవైఎస్సార్ పథకాల్ని తీసుకొస్తాం - వైఎస్ షర్మిల

వైఎస్సార్ పథకాల్ని తీసుకొస్తాం – వైఎస్ షర్మిల

కేసీఅర్ సర్కార్ ఇళ్లులు కట్టే ప్రభుత్వం కాదని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఈ సర్కార్ పేదలకు పెన్షన్ ఇచ్చేది కాదన్నారు. బెల్లంపల్లి నియోజక వర్గంలో ఈ రోజు కొనసాగుతున్న ప్రజా ప్రస్థానం పాదయాత్ర…బట్వాన్ పల్లి, మన్నేగూడేం, పెర్కపల్లి గ్రామాల్లో వైఎస్ షర్మిలకి ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు, అభిమానులు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కేసీఅర్ సర్కార్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేది కాదని విమర్శించారు.

YSR సంక్షేమ పథకాలు మళ్ళీ తెలంగాణలో అమలు కావాలని, ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం రావాలని వైఎస్ షర్మిల అన్నారు. YSR ప్రజల కోసమే బ్రతికాడు..ప్రజల కోసం చనిపోయాడన్నారు. YSR ప్రభుత్వం మళ్ళీ తీసుకు రావటమే లక్ష్యంగా పెట్టిన పార్టీ YSRTP అని, ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద పక్కా ఇళ్లులు ఇస్తామన్నారు. ఇంట్లో ఎంత మంది వృద్దులు ఉంటే అందరికీ పెన్షన్ ఇస్తామని, ఫీజు రీయింబర్స్మెంట్,అరోగ్యశ్రీ పథకాలకు పునర్ వైభవం తీసుకోస్తామన్నారు. వైఎస్సార్ ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తా అని వైఎస్ షర్మిల భరోసా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular