Friday, March 29, 2024
HomeTrending Newsఆర్బీకేలపై వాలంటీర్ల పెత్తనం: గోరంట్ల ఆరోపణ

ఆర్బీకేలపై వాలంటీర్ల పెత్తనం: గోరంట్ల ఆరోపణ

రైతుల నుంచి ధాన్యం సేకరణలో రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) విఫలమవుతున్నాయని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.  రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులు నానా అగచాట్లు పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  ఇప్పటికీ రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాల నిర్మాణం 20 శాతం కూడా పూర్తి కాలేదన్నారు. రైతుల పంటపై సకల హక్కులు ఆర్బీకేలకు దాఖలు పరుస్తున్నారన్నారు. ఆర్బీకేలపై మొత్తం పెత్తనం వాలంటీర్లకే ఇచ్చారని, వారు ఉంటేనే కానీ పంట కోయకూదడనే కొత్త సిద్ధంతాన్ని అమల్లోకి తెచ్చారని విమర్శించారు. ప్రభుత్వం తాను కొనడం లేదని, బైట అమ్ముకోనీయడం లేదని అన్నారు.

రైస్ మిల్లర్లకు చెల్లించాల్సిన 500 కోట్ల రూపాయల బకాయిలు ఇంకా పూర్తి చేయలేదని దీనితో వారు సమ్మె బాట పట్టి రైతులనుంచి ధాన్యం సేకరణ చేయడంలేదని చెప్పారు.  కష్టపడి పండించిన ధాన్యం ఎక్కడ వర్షాలకు తడిసిపోతుందో అని రైతులు ఆందోళనలో ఉన్నారని, నష్టపరిహారం కూడా సరిగా ఇవ్వడం పోవడంతో రైతులకు ఆత్మహత్య చేసుకోవాల్సిన  పరిస్థితి వస్తోందన్నారు.  గత ఏడాది 47.83, 347 లక్షకల్ మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే ఈ ఏడాది 30 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణమన్నారు.

ప్రభుత్వ రైతుల నుంచి మొత్తం ధాన్యాన్ని సేకరించాలని, రవాణా ఖర్చుల కింద ఇస్తానని చెప్పిన 25 రూపాయలు ఇవ్వాలని, మద్దతు ధరకు ఒక్క రూపాయి కూడా తగ్గకుండా చూడాలని గోరంట్ల డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్