Sunday, June 7, 2026
Homeసినిమా‘సర్కారు వారి పాట’ లో సముద్ర ఖని

‘సర్కారు వారి పాట’ లో సముద్ర ఖని

సూపర్ స్టార్ మహేష్‌ బాబు – గీత గోవిందం ఫేమ్ పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయడం.. కొంత టాకీ పూర్తి చేయడం కూడా జరిగింది కానీ.. విలన్ ఎవరు అనేది ప్రకటించలేదు. అనిల్ కపూర్, అరవింద స్వామి, ఉపేంద్ర, సుదీప్.. ఇలా కొంత పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. యాక్షన్ కింగ్ అర్జున్ ని ఫైనల్ చేశారని.. ఆయన ఇందులో పోలీసాఫీసర్ గా నటించనున్నారని వార్తలు వచ్చాయి. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. అర్జున్ నటించడం అనేది వాస్తవం కాదని.. సముద్ర ఖని విలన్ గా నటించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.

అల.. వైకుంఠపురములో.. సముద్రఖని విలన్ రోల్ కు మంచి పేరు వచ్చింది. ఆయన మేనరిజమ్, డైలాగ్ డెలివరీ విశేషంగా ఆకట్టుకోవడంతో ఆడియన్స్ లో క్రేజ్ వచ్చింది. అందుకే సముద్ర ఖని ని ఫైనల్ చేశారని తెలుస్తోంది. తాజా షెడ్యూల్ త్వరలో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బ్యాంక్ రుణాల ఎగవేత అనే విభిన్న కథాంశంతో రూపొందుతోన్నఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్కారు వారి పాట రెడీ అవుతోంది. మరి.. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు.. ఇలా వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధిస్తూ కెరీర్ లో దూసుకెళుతున్న మహేష్‌ ‘సర్కారు వారి పాట’తో కూడా మరో బ్లాక్ బస్టర్ సాధిస్తారని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular