Saturday, March 14, 2026
HomeTrending Newsజీ20 దేశాల సమావేశానికి పుతిన్ గైర్హాజరు

జీ20 దేశాల సమావేశానికి పుతిన్ గైర్హాజరు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జీ20 భేటీకి హాజరుకావడం లేదు. ఇండోనేషియాలోని బాలిలో ఈ నెల 15-16 తేదీలలో జీ20 శిఖరాగ్ర సమావేశాలు  జరుగనున్నాయి. ఈ సమావేశాలకు హాజరుకాకూడదని పుతిన్ నిర్ణయించినట్లు ఏఎఫ్‌పీ వార్తాసంస్థ కథనం. పుతిన్  ప్రతినిధిగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ను భేటీకి పంపుతున్నారు. అయితే, ఈ సమావేశాలకు పుతిన్ హాజరయ్యే అవకాశాలను తోసిపుచ్చలేమని ఇండోనేషియాలోని రష్యన్ రాయబార కార్యాలయం ప్రోటోకాల్ చీఫ్ యులియా టామ్స్కాయ వెల్లడించారు.

పాశ్చాత్య దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వాటి నివారణకు…జీ20లో పాల్గొనేందుకు బాలి వెళ్లకూడదని పుతిన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తున్నది. 9 నెలల తర్వాత కూడా యుద్ధం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి ఎదురయ్యే విమర్శలను తిప్పికొట్టేందుకు సరైన సమయం కానందున జీ20 సమావేశాలకు గైర్హాజరవడం ఒక్కటే మార్గమని రష్యా ఉన్నత వర్గాలు భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది. అయితే పాశాత్య దేశాల కుట్రలు, కుయుక్తుల నేపథ్యంలో పుతిన్ జీ20 దేశాల సమావేశాలకు హాజరు కావటం లేదని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.
జీ20  సమావేశాల్లో అదితి హోదాలో పాల్గొనాలని ఇండోనేషియా ఇప్పటికే ఉక్రెయిన్ ను ఆహ్వానించింది. అయితే రష్యా పాల్గొనే సమావేశాల్లో తమ దేశం పాల్గోనదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జేలేన్సకీ తేల్చి చెప్పారు. అయితే తెర వెనుక మంత్రాంగం నడిపిస్తున్న అమెరికా, యూరోప్ దేశాల సలహాతో వర్చ్యువల్ ద్వారా ఉక్రెయిన్ జీ20 సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది.  జీ20 దేశాలకు ఈ ఏడాది డిసెంబర్ 1వ తేది నుంచి 2023 నవంబర్ 30 వరకు భారత దేశం అధ్యక్షత వహించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular