ఇంగ్లాండ్ జట్టు పురుషుల టి 20 వరల్డ్ కప్ ఫైనల్స్ కు చేరుకుంది. నేడు జరిగిన సెమీ ఫైనల్లో ఇండియాపై అద్భుత విజయంతో టైటిల్ రేసులో నిలిచింది. ఇండియా విసిరిన 169 పరుగుల లక్ష్యాన్ని వికెట్ వికెట్ నష్ట పోకుండా మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది.
కెప్టెన్ జోస్ బట్లర్ 49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 80; అలెక్స్ హేల్స్ 47 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 86 పరుగులతో సత్తా చాటారు. వీరిద్దరూ టి 20ల్లో ఏ వికెట్ కైనా రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు
తొలి వికెట్ కు పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి విజయానికి గట్టి పునాదులు వేశారు.
అడిలైడ్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. జట్టు స్కోరు 9 వద్ద ఓపెనర్ కేఎల్ రాహుల్ (5) తొలి వికెట్ గా వెనుదిరిగాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 27 స్కోరు చేయగా, ఈ టోర్నీలో మంచి ఫామ్ లో ఉన్న సూర్య కుమార్ యాదవ్ 14 పరుగులే చేసి ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా 33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 63; విరాట్ కోహ్లీ 40 బంతుల్లో 4ఫోర్లు, 1 సిక్సర్ తో 50 పరుగులతో రాణించారు. ఇన్నింగ్స్ చివరి బంతికి రోహిత్ శర్మ ఫోర్ కొట్టినా హిట్ వికెట్ తో ఔట్ కావడం గమనార్హం. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3; క్రిస్ ఓక్స్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ పడగొట్టారు.
Also Read : ICC Mens T20 World Cup 2022 : ఫైనల్స్ కు పాకిస్తాన్