Sunday, November 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ఇకపై తెలుగు-సంస్కృత అకాడమి

ఇకపై తెలుగు-సంస్కృత అకాడమి

ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమి పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ‘తెలుగు-సంస్కృత అకాడమి’గా పని చేయనుంది. మొత్తం నలుగురు సభ్యులను బోర్డ్ అఫ్ గవర్నర్లుగా, యూ.జి.సి. నుంచి ఒక నామినీ తోపాటు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ఎక్స్-అఫీషియో సభ్యుడిగా పాలకవర్గంలో చోటు కల్పించారు.

  • డా. డి. భాస్కర్ రెడ్డి, (రిటైర్డ్ ప్రొఫెసర్-కెమిస్ట్రీ, ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతి)
  • డా. నేరెళ్ళ రాజకుమార్ (జ్యోతిష్య శాస్త్ర ఉపాధ్యాయుడు)
  • డా. ఎం. విజయశ్రీ (రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్-తెలుగు, జేకేసి కాలేజ్, గుంటూరు)
  • డా. కప్పగంతు రామకృష్ణ (తెలుగు లెక్చరర్, ఎస్ ఆర్ ఎస్ వీ కాలేజీ, విజయవాడ)
    లను అకాడమీకి బోర్డ్ అఫ్ గవర్నర్లుగా నియమించింది ప్రభుత్వం.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నామినీగా

  • ప్రో. వి. మురళీధర్ శర్మ, తిరుపతి జాతీయ సంస్కృత యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ను నియమించింది.

ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని అకాడమి డైరెక్టర్ ను ఆదేశించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్