Thursday, April 25, 2024
Homeసినిమాలవ్‌ యు అలీ భాయ్‌ : సోనూసుద్‌

లవ్‌ యు అలీ భాయ్‌ : సోనూసుద్‌

నరేశ్, అలీ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’. మలయాళంలో విడుదలై సంచలన విజయంగా నమోదైన ‘వికృతి’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. సోషల్‌ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరి వల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్‌లు సంయుక్తంగా నిర్మించారు. శుక్రవారం ఈ సినిమాలోని రెండో పాటను ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త సోనూసుద్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ…‘‘ అలీ గారు అనేక సినిమాలు చేసి సినిమా పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్నారు. అలీ, నేను పూరి గారు డైరెక్ట్‌ చేసిన ‘‘సూపర్‌’’ సినిమా సమయం నుండే మంచి స్నేహితులం. అలీ సెట్లో ఉంటే ఎంతో సందడిగా ఉండేది. ఆయన అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌  అనే బ్యానర్‌ని పెట్టి సినిమాలు తీయటం చాలా ఆనందంగా ఉంది. ఆయన బ్యానర్‌ పేరు ‘‘అలీవుడ్‌’’ రాకింగ్‌గా ఉంది. ఈ సినిమాలోని ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’ టైటిల్‌ సాంగ్‌ను నేను విడుదల చేయటం ఆనందంగా ఉంది. అలీ భాయ్‌ నువ్వెప్పుడు సూపర్‌స్టారే, లవ్‌ యూ’’ అన్నారు.

అలీ మాట్లాడుతూ..‘‘ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి ఏ సాయం కావాలన్నా దేశం మొత్తం ఒక వ్యక్తి వైపే చూస్తుంది. అందుకే మా సినిమాకి సంబంధించిన టైటిల్‌ సాంగ్‌ ‘‘ అందరూ బావుండాలి, అందులో నేనుండాలి’’ అనే పాటను అందరూ బావుండాలి అని కోరుకునే వ్యక్తితో విడుదల చేయిస్తే బావుంటుంది అనుకుని సోనూసుద్‌ని అడిగాను. వెంటనే ఒప్పుకుని పాటను విడుదల చేశారు. సోనూసుద్‌ విడుదల చేసిన ఈ పాటను తన ఫ్యాన్స్, తన ద్వారా సాయం పొందిన ఎన్నో కుటుంబాలు పాడుకుంటాయి. సోనూకు అభినందనలు. ప్రజలందరూ ఎంతో ఇష్టంగా ఈ పాటను పాడుకుంటారు. నాకు నమ్మకం ఉంది’’ అన్నారు.

శివబాలాజీ,  మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి,సనా, వివేక్, శివారెడ్డి, సప్తగిరి, పృధ్వీ, రామ్‌జగన్, భద్రం, లాస్య తదితరులు నటించారు. ఈ చిత్రానికి చీఫ్‌ క్రియేటివ్‌ హెడ్‌ : ఇర్ఫాన్, కో డైరెక్టర్‌: ప్రణవానంద్‌, కెమెరా: ఎస్‌ మురళీమోహన్‌ రెడ్డి, ఆర్ట్‌: కెవి రమణ, డాన్స్‌ డైరెక్టర్‌: స్వర్ణ, ఎడిటర్‌: సెల్వకుమార్, ఫైట్స్‌: నందు, మేకప్‌:నంద్యాల గంగాధర్, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సయ్యద్‌ తాజ్‌ బాషా, విఎఫ్‌ఎక్స్‌: మాయాబజార్‌ స్టూడియో.

RELATED ARTICLES

Most Popular

న్యూస్