ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వల్లే జల వివాదం ఏర్పడిందని ఏపి డిప్యూటీ ముఖ్యమంత్రి కే. నారాయణ స్వామి ఆరోపించారు. కృష్ణా జలాల వివాదంపై చంద్రబాబు ఇంతవరకూ ఎందుకు బహిరంగంగా తన అభిప్రాయం చెప్పలేదని ప్రశ్నించారు. బాబు దుర్మార్గపు పాలన వల్లే రాష్ట్రం సర్వనాశనమిందని విమర్శించారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్లు కట్టించే కార్యక్రమం ఓ యజ్ఞంలా సాగుతోందని చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శిచుకున్న నారాయణస్వామి అనంతరం మీడియాతో మాట్లాడారు.
వైఎస్ జగన్, షర్మిల మధ్య ఎలాంటి విభేదాలు, మనస్పర్ధలు లేవని స్పష్టం చేశారు. లేని వివాదాన్ని మీడియా సృష్టించవద్దని వ్యాఖ్యానించారు. జగన్ రెండు తెలుగు రాష్ట్రాలను సమానంగా చూస్తారని, ఆంధ్రా వేరు, తెలంగాణా వేరు అని ఎప్పుడూ భావించలేదన్నారు. కేసిఆర్ అంటే జగన్ కు అభిమానం ఉందన్నారు.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.