Thursday, September 19, 2024
Homeసినిమా'ఆదిత్య 999' డైరెక్ట్ చేస్తా - బాలయ్య

‘ఆదిత్య 999’ డైరెక్ట్ చేస్తా – బాలయ్య

బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఆదిత్య 369‘ సీక్వెల్ ‘ఆదిత్య 999’. ఈ మూవీకి సింగీతం శ్రీనివాసరావు కథ ఎప్పుడో రెడీ చేశారు. ఆయన కూడా ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది. ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ ద్వారా బాలయ్య వారసుడు మోక్షజ్ఞను పరిచయం చేయాలి అనుకున్నారు కానీ.. ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ పైకి రాలేదు. అలాగే మోక్షజ్ఞ సినీ రంగప్రవేశం జరగలేదు. తెలుగు సినిమాల్లోనే కాదు బాలయ్య కెరీర్ లోనే ‘ఆదిత్య 369’ ఎప్పటికీ మరచిపోలేని చిత్రం. ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాతో వంద సినిమాలు పూర్తి చేసిన తర్వాత బాలయ్య మరింత స్పీడు పెంచి సినిమాలు చేస్తున్నారు కానీ.. ఆదిత్య 369 సీక్వెల్ గురించి మాత్రం అనౌన్స్ చేయడం లేదు. ఈ సినిమా గురించి అడిగిన ప్రతిసారీ ఖచ్చితంగా ఆదిత్య 369 సీక్వెల్ ఉంటుందని చెప్పేవారు. ఇదిలా ఉంటే… విశ్వక్ సేన్ తనే హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన మూవీ దాస్ కా ధమ్కీ. ఈ సినిమా మొదటి ట్రైలర్ ని బాలయ్య లాంచ్ చేశారు. కుర్ర హీరో డైరెక్టర్ గా సినిమా తీయడంతో అదే వేదిక పై తన డైరెక్షన్ లోనే ఆదిత్య 999 ఉంటుందని బాలయ్య ప్రకటించారు.

ఆదిత్య 369 సీక్వెల్ గురించి ఇప్పటికే చాలా సార్లు ప్రచారం జరిగింది కానీ, ఆ సినిమా ఇప్పటి వరకు మొదలుకాలేదు. ఈ సినిమా గురించి ఇప్పుడు నందమూరి బాలకృష్ణ స్వయంగా వెల్లడించారు. ఆదిత్య 369కి సీక్వెల్ గా ఆదిత్య 999 తీస్తాను. నేనే డైరెక్ట్ చేస్తాను. వచ్చే ఏడాది మొదలవుతుంది అని బాలయ్య తెలియచేశారు.
బాలకృష్ణ కెరీర్ లో ఒక క్లాసిక్ గా మిగిలింది ఆదిత్య 369. ఆ సినిమాకి ఎందరో అభిమానులు ఉన్నారు. అయితే.. బాలయ్యకు డైరెక్షన్ చేయాలనేది కల. ఆ కల ఆదిత్య 999తో నెరవేరుతుందేమో చూడాలి.

Also Read : ఆదిత్య 369 సీక్వెల్ లో మోక్షజ్ఞ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్