లహరి మ్యూజిక్ సంస్థ శుక్రవారం యూట్యూబ్ నుంచి ‘యూట్యూబ్ డైమండ్’ అవార్డును సొంతం చేసుకుంది. సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు ఏ మ్యూజిక్ సంస్థకు దక్కని గౌరవాన్ని దక్కించుకుంది. గత సంవత్సరం నవంబర్ నెలలో ఒక కోటి చందాదారులను చేరుకున్న అయిన ఈ ఐకానిక్ మ్యూజిక్ కంపెనీ ప్రస్తుతం కోటి 18 లక్షల చదాదారులతో దూసుకుపోతుంది. 10 సంవత్సరాల క్రితం డిజిటల్ ఫార్మెట్‌లోకి ప్రవేశించి యూట్యూబ్ చానల్ స్థాపించిన లహరి.. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లోని పాటలతో ప్రేక్షకులను అలరిస్తోంది.
యూట్యూబ్ డైమండ్ అవార్డ్ అందుకున్న సందర్భంగా లహరి అధినేత వేలు మాట్లాడుతూ.. ‘‘ఈ అవార్డును అందుకునేందుకు రీచ్ అయినందుకు సంతోషంగా ఉంది. ఈ అవార్డును కర్నాటక ప్రజలకు అంకితమిస్తున్నాము. 45 సంవత్సరాల నుంచి వారందిస్తున్న సపోర్ట్ మరవలేనిది. చిన్న కంపెనీ నుంచి ఈ రోజు ఈ స్థాయికి లహరి చేరడానికి వారి సహకారం ఎంతో ఉంది. అందుకే ఈ అవార్డు వారిదే. అలాగే తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము’’ అన్నారు.