కాళేశ్వరం కమీషన్ ప్రాజెక్ట్ కనుకనే మూడు నెలల్లో మునిగిందని YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. కాళేశ్వరం పేరు చెప్పి 70 వేల కోట్లు కమీషన్ తిన్నారని ఆరోపించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి అంబేడ్కర్ సర్కిల్ వద్ద YSRTP భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ… పోడు భూముల సమస్యల పై కుర్చీ వేసుకొని పట్టాలు ఇస్తా అని కేసీఅర్ పచ్చి అబద్ధాలు చెప్పాడన్నారు. ఇప్పటి వరకు కుర్చీ దొరకలేదా..అని ఎద్దేవా చేశారు.
షర్మిల విమర్శలు ఆమె మాటల్ల్లోనే
భూపాలపల్లి సింగరేణి ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ బావులను కుర్చీ వేసుకొని బంద్ చేస్తా అన్నాడు. కేసీఅర్ సీఎం అయ్యాక ఇక్కడ ఓపెన్ కాస్ట్ బావులు పెరిగాయి. అండర్ గ్రౌండ్ బావులను మూసి వేసి ఓపెన్ కాస్ట్ చేస్తున్నారు. సింగరేణి నీ సర్వనాశనం చేస్తున్నారు. ఎన్నికలు కూడా లేకుండా చేశారు. సింగరేణిలో YSR ఉన్నప్పుడు లక్షా 16 వేల మంది ఉద్యోగులు ఉండే వాళ్ళు. ఇప్పుడు 45 వేల మందికి కుదించారు. సింగరేణి CSR ఫండ్స్ కార్మికుల సంక్షేమం కోసం ఎందుకు ఖర్చు పెట్టడం లేదు. CSR ఫండ్స్ సిద్దిపేట,గజ్వేల్ కి తరలిస్తున్నారు.
దేవాదుల కమీషన్ ల కోసం చేసిన ప్రాజెక్ట్ కాదు. అందుకే ఈ రోజు వరకు నిలబడింది. కమీషన్ ల ప్రాజెక్ట్ కాళేశ్వరం కాబట్టి మూడు నెలల్లో మునిగింది. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు…ఉద్యమ కారుడు కాస్త… కల్వకుంట్ల కమీషన్ రావు లా మారాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్పి 70 వేల కోట్లు కమీషన్ తిన్నాడు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. కాంగ్రెస్ లో గెలిచి TRS కి అమ్ముడు పోయాడు. నమ్మి ఓటు వేస్తే నమ్మకాన్ని అమ్మకం పెట్టాడు. నియోజక వర్గంలో మంచినీటికి, డ్రైనేజీ నిర్మాణానికి కూడా దిక్కు లేదట. ఎన్నికల ముందు చాలా మాటలు చెప్పాడు. స్పీకర్ మధుసూదన చారి ది కుటుంబ పాలన అన్నాడు. కుటుంబ పాలన ఉండదు అన్నాడు..నన్ను ఎన్నుకోండి అన్నాడు. ఇప్పుడు ఈయన కుటుంభం మొత్తం పదవులు అనుభవిస్తున్నారు. ఈయన భార్య జిల్లా పరిషత్ చైర్మన్,ఈయన కొడుకు ఆయిల్ పామ్ కాంట్రాక్ట్. గండ్ర ను గెలిపిస్తే నో కమీషన్, నో కలెక్షన్ నో టాక్స్ అన్నాడు. నియోజక వర్గంలో మొత్తం దోపిడీ నే. భూపాలపల్లి పై విజన్ అన్నాడు..మోసం చేశాడు.
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు గోదావరి ఉంది . బొగ్గు ఉంది.. ఇసుక ఉంది.. కరెంట్ ఉంది..కానీ ఒక్క పరిశ్రమ లేదు. ఇది భూపాల పల్లి కాదట..గండ్ర కాంప్లెక్స్ అంట. ఆయన ఎస్టేట్ లా చేశాడు నియోజక వర్గాన్ని. మైనింగ్ మాఫియా.. గ్రానైట్ మాఫియా.. ఇసుక మాఫియా.. ఇలా మొత్తం మాఫియా నే. అక్రమంగా అధికారం అడ్డు పెట్టుకొని 3 వేల కోట్లు వెనకేశాడు. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో 25 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అయినా ఒక్క ఎకరాకు ఈ ఎమ్మెల్యే పరిహారం ఇప్పించలేక పోయాడు. ఇక కేసీఅర్ పాలన మూలన ఉన్న ముసలామెను కొట్టినట్లు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఇచ్చింది 20 వేల ఉద్యోగాలు మాత్రమే. నా మనవడు..నర్సయ్య మనవడు ఓకే బొజనం తినాలి అన్నాడు. కేసీఅర్ మనవడు బంగారు పళ్ళెంలో బువ్వ తింటున్నాడు .నర్సయ్య మనవడు పురుగులు పట్టిన దొడ్డు బియ్యం తింటున్నాడు. బంగారు తునక రాష్ట్రాన్ని కేసీఅర్ అప్పుల కుప్ప చేసి పెట్టాడు. బంగారు తెలంగాణ అని చెప్పి బీర్లు తెలంగాణ..బార్ల తెలంగాణగా మార్చారు. గుడిబడి కన్నా.. మద్యం షాపులు ఎక్కువ. 4 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టాడు.
Also Read : బండి సంజయ్, మంత్రి గంగుల ఇద్దరు ఒకటే వైఎస్ షర్మిల