Thursday, April 25, 2024
Homeసినిమా'గాలోడు' విజయం ప్రతీ ఒక్కరిది : రాజశేఖర్ రెడ్డి

‘గాలోడు’ విజయం ప్రతీ ఒక్కరిది : రాజశేఖర్ రెడ్డి

సుడిగాలి సుధీర్‍‍‍‍ హీరోగా న‌టించిన ప‌క్కా మాస్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `గాలోడు`. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం నవంబర్ 18న విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమా  సెలెబ్రేషన్స్ నిర్వహించారు.

తమ్మారెడ్డి భరద్వాజ‌ మాట్లాడుతూ.. ‘గాలోడు సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. కష్టాన్ని నమ్మినవాడికి అదృష్టం వస్తుంది అని. సుధీర్ కష్టపడ్డాడు. అదృష్టం కూడా కలిసి వచ్చింది. సుధీర్ ఎంతో సహజంగా నటించారు. ఎంతో సిన్సియర్‌గా యాక్ట్ చేశారు. సినిమాలో ఏదో మంచి థ్రిల్ ఉంది. అందుకే సినిమా అద్భుతంగా ఆడుతోంది. ఇది ఓ మిరాకిల్. సుధీర్ ఇంకా మంచి సినిమాలు చేయాలి. నేను చేసిన ప్రతీ సినిమా హిట్ అవుతూనే వచ్చింది. ఈ చిత్రం కూడా హిట్ అయింది. సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

దర్శకనిర్మాత రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ‘గాలోడు సక్సెస్ ఏ ఒక్కరిదో కాదు.. టీం అందరిది. అందరికీ మనస్పూర్తిగా థాంక్స్ చెబుతున్నా. కథ రాయడం, సినిమా తీయడం, ప్రొడక్షన్ చేయడం ఈజీనే. కానీ సినిమాను రిలీజ్ చేయడమే చాలా కష్టం. మాకు సపోర్ట్ చేసిన డిస్ట్రిబ్యూటర్ జనార్థన్ గారికి థాంక్స్. మళ్లీ సినిమా తీసి, సక్సెస్ కొట్టి.. ఇలా కలుస్తాను అని అనుకుంటున్నాను’ అని అన్నారు.

సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. ‘గాలోడు సినిమాకు పెట్టిన ప్రతీ రూపాయి వెనక్కి వచ్చాకే సక్సెస్ మీట్ పెడదామని అన్నాను. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరిది ఈ విజయం. ఇన్ని థియేటర్లో నా సినిమా రిలీజ్ అవుతందని అనుకోలేదు. దీనికి కారణమైన జనార్ధన్ గారికి థాంక్స్. ఆయనకు రుణపడిపోయాను. నేను అభిమానులు అని అనను. నా ఫ్యామిలీ అంటాను. ఈ విజయం ప్రతీ ఒక్కరిదీ. ప్రతీ ఒక్క ఇంట్లో ఉండే వారిది. ప్రతీ తల్లిదండ్రులది. ఎందుకంటే వారు నన్ను కొడుకులా చూశారు. ఈ సినిమా వాళ్ల సినిమా అనుకుని చూశారు. ప్రతీ ప్రేక్షకుడికి పాదాభివందనం. జీవితాంతం మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈరోజు ఇక్కడకు వచ్చిన ఇంద్రజ గారికి థాంక్స్. ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శకుడికి థాంక్స్. ప్రతీ సినిమా బాగుండాలి.. అన్ని సినిమాలు చూడండి.. ఇక్కడకు వచ్చినందుకు తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి థాంక్స్’ అని అన్నారు.

Also Read :  & #8216;గాలోడు’ ఫుల్ మాస్ కమర్షియల్ సినిమా – సుడిగాలి సుధీర్‌

RELATED ARTICLES

Most Popular

న్యూస్