Friday, June 12, 2026
Homeసినిమామహేష్ మూవీపై క్లారిటీ ఇచ్చిన థమన్

మహేష్ మూవీపై క్లారిటీ ఇచ్చిన థమన్

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ రూపొందనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరు కలిసి చేస్తున్న సినిమా కావడంతో అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో మహేష్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆమధ్య ఫస్ట్ షెడ్యుల్ కంప్లీట్ చేసుకుంది.

అయితే.. ఫస్ట్ షెడ్యుల్ లో యాక్షన్ పార్ట్ మహేష్ కి నచ్చలేదని.. కథలో మార్పులు చేర్పులు చేయమని చెప్పారని టాక్ వినిపించింది. మహేష్ చెప్పినట్టుగానే త్రివిక్రమ్ కథలో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే.. కథను పూర్తిగా మార్చేసారని తెలిసింది. మరో వార్త ఏంటంటే… ఈ చిత్రానికి మ్యూజిక్ అందించే బాధ్యతను సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ కి అప్పగించారు. అయితే.. థమన్ వర్క్ మహేష్‌ కి నచ్చలేదని.. అందుచేత థమన్ ని కాకుండా అనిరుథ్ ని తీసుకోమని మహేష్‌ త్రివిక్రమ్ కి చెప్పాడని వార్తలు వచ్చాయి.

దీంతో థమన్ ప్లేస్ లో అనిరుథ్ మ్యూజిక్ అందించనున్నారని ప్రచారం జరిగింది. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై థమన్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల థమన్ బర్త్ డే కాగా చిత్ర నిర్మాత నాగవంశీ విషెష్ చెప్తూ మహేష్ 28 కి ఇచ్చే మార్వలెస్ ట్యూన్స్ కోసం ఎదురు చూస్తున్నానని తెలియజేశారు. దీనికి రిప్లై ఇస్తూ థమన్ ఖచ్చితంగా మహేష్ సినిమాకి అదరగొడదామని కన్ఫర్మ్ చేసేసాడు. దీనితో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఉన్న రూమర్స్ పై అందరికీ ఓ క్లారిటీ వచ్చేసినట్టే అని చెప్పాలి. డిసెంబర్ నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

Also Read : మహేష్‌, త్రివిక్రమ్ మూవీ మరింత ఆలస్యం? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular