ఇండియా-న్యూజిలాండ్ మధ్య నేడు మొదలైన రెండో వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. హామిల్టన్ లోని సెడ్డాన్ పార్క్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో కివీస్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
తొలుత 4.5 ఓవర్లలో 22 పరుగుల వద్ద వర్షం కాసేపు ఆటకు అంతరాయం కలిగించింది. కాసేపటికి ఆట తిరిగి మొదలు కాగా వెంటనే కెప్టెన్ శిఖర్ ధావన్(3) ఔటయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ ఈ మ్యాచ్ లో ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగారు. శుభ్ మన్ గిల్- సూర్య కుమార్ యాదవ్ లు కలిసి 12.5 ఓవర్లలో స్కోరును 89కు చేర్చారు. ఈ సమయంలో మరోసారి పెద్ద జల్లులతో వర్షం పడింది. ఆట కొనసాగించే అవకాశం లేకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆట ఆగిపోయే సమయానికి గిల్-45; సూర్య కుమార్ యాదవ్ -34 పరుగులతోను క్రీజులో ఉన్నారు.
తొలి మ్యాచ్ లో ఆతిథ్య కివీస్ ఏడు వికెట్లతో విజయం సాధించిన విషయం విదితమే. మూడవ, ఆఖరి మ్యాచ్ బుధవారం నవంబర్ 30న క్రైస్ట్ చర్చ్ లోని హేగ్లీ ఓవల్ మైదానంలో జరగనుంది.
Also Read :Tom Latham: తొలి వన్డేలో కివీస్ విజయం