Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్Hockey: మూడో టెస్టులో ఇండియా విజయం

Hockey: మూడో టెస్టులో ఇండియా విజయం

ఇండియా-ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ మాటే స్టేడియంలో జరుగుతోన్న ఐదు మ్యాచ్ ల హాకీ సిరీస్ లో ఇండియా తొలి విజయం దక్కించుకుంది. ఆకాష్ దీప్ సింగ్ చివరి నిమిషంలో చేసిన అద్భుతమైన ఫీల్డ్ గోల్ తో డు జరిగిన మూడో మ్యాచ్ లో 4-3 గోల్స్ తేడాతో మన్ ప్రీత్ సేన పైచేసి సాధించింది.   వరుసగా రెండు మ్యాచ్ ల్లో గెలిచి…నేడు కూడా సత్తా చాటి సిరీస్ గెల్చుకోవాలన్న ఆతిథ్య ఆసీస్ కు నిరాశ మిగిలింది.

  • ఆట 11వ నిమిషంలో ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ చేసి స్కోరు బోణీ కొట్టాడు.
  • 24, 32 నిమిషాల్లో ఆసీస్ రెండు పేనాల్టీ కార్నర్ గోల్స్ సాధించింది.
  • చివరి పావు భాగం మొదలైన కాసేపటికే ఇండియా ఆటగాడు అభిషేక్ పేనాల్టీ కార్నర్ గోల్ చేసి స్కోరు సమం చేశాడు.
  • 56వ నిమిషంలో షంషేర్ సింగ్ మరో గోల్ సాధించి స్కోరును 3-2 ఆధిక్యానికి తీసుకెళ్ళాడు.
  • అయితే ఆట చివరి నిమిషంలో ఆస్ట్రేలియా ఆటగాడు నాథన్ గోల్ చేసి స్కోరును 3-3తో మళ్ళీ సమం చేశాడు.
  • మరో 30 సెకన్లలో ఆట ముగుస్తుందనగా ఇండియా ఆటగాడు ఆకాష్ చురుగా కదిలి ఫీల్డ్ గోల్ చేసి గెలుపు అందించాడు.

ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఆసీస్ 2-1తో ఆధిక్యంలో ఉంది. డిసెంబర్ 3,4 తేదీల్లో మిగిలిన రెండు మ్యాచ్ లు జరగనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్