Saturday, November 23, 2024
HomeTrending Newsపదో తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం

పదో తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల పదో తేదీన ప్రగతిభవన్‌లో జరుగనున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షత వహించే ఈ సమావేశంలో.. ధాన్యం కొనుగోళ్లను మరిం త ముమ్మరం చేయడంపై చర్చించే అవకాశం ఉన్నది. సొంత జాగలు ఉన్న బలహీన వర్గాలకు ఇండ్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం మహబూబ్‌నగర్‌ సభలో ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఈ అంశంతోపాటు.. రైతుబంధు నిధుల విడుదల, దళితబంధు పథకం అమలు తదితర అంశాలపైనా ఈ సమా వేశంలో చర్చించే అవకాశం ఉన్నది. శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే క్యాబినెట్‌ సమావే శానికి వివిధ శాఖల మంత్రులు హాజరుకానున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్