Sunday, November 24, 2024
HomeTrending Newsపర్యావరణ పరిరక్షణ కోసమే హరితహారం - జగదీష్ రెడ్డి

పర్యావరణ పరిరక్షణ కోసమే హరితహారం – జగదీష్ రెడ్డి

తెలంగాణలో సీఎం కేసీఆర్ లేకుంటే చెట్లు లేక పర్యావరణం దెబ్బతినేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. లక్ష మొక్కల మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా దేవరకొండ రోడ్డులో మంత్రి జగదీష్ రెడ్డి మొక్కలు నాటారు. కొన్ని దేశాల్లో ఆక్సిజన్ కొనుక్కుంటున్నారని చెప్పారు. భారతదేశంలోనూ ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితులు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మంచి నీళ్లు కొనుక్కుని తాగుతున్నామన్న ఆయన.. సీఎం కేసీఆర్ తెలంగాణలో లేకుంటే చెట్లు లేక పర్యావరణం దెబ్బతినేదని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసమే తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టిందని మంత్రి వెల్లడించారు.

100 శాతం ఆక్సిజన్ పీల్చుకోవాలంటే ప్రతి మనిషి ఆరు మొక్కలు నాటాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. కొన్ని విదేశాల్లో ఒక్క మనిషి ఆరు వేల మొక్కలు నాటిన సంఘటనలూ ఉన్నాయని తెలిపారు. కొన్ని దేశాల్లో మొక్కలు ఖచ్చితంగా నాటితేనే వివాహాలు చేసుకోవాలి, పిల్లల కోసం సైతం నిబంధనలు ఉన్నాయని చెప్పారు. మొక్కలు నాటి, వాటిని సంరక్షించుకుని భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వాలని కోరారు. నల్గొండ పట్టణంలో ఇప్పటికే 15 లక్షలకుపైగా మొక్కలు నాటారని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్