ప్రధాని నరేంద్రమోదీకి రాజకీయ నాయకత్వ లక్షణాలు లేవని, రాజకీయ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించడంలో ఆయన విఫలమయ్యారని హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. భారత్-చైనా సరిహద్దుల్లో ఈ నెల 9న ఘర్షణలు జరిగితే ప్రభుత్వం ఇవాళ ప్రకటన చేసిందని విమర్శించారు.
మీడియా ఈ విషయాన్ని బయటపెట్టి ఉండకపోతే ప్రభుత్వం ప్రకటన చేసి ఉండేది కాదని అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలను ఘర్షణ జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. చైనా పేరెత్తాలంటేనే ప్రధానికి భయమని, చైనా గురించి మాట్లాడాలంటే మోదీ సర్కారుకు భయమని ఒవైసీ విమర్శించారు.