Monday, June 15, 2026
Homeసినిమామరో మూవీకి పవన్ గ్రీన్ సిగ్నల్?

మరో మూవీకి పవన్ గ్రీన్ సిగ్నల్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ.. మరో వైపు వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం క్రిష్‌ డైరెక్షన్ లో ఏఎం.రత్నం నిర్మిస్తోన్న  ‘హరి హర వీరమల్లు’ చేస్తున్నారు. భారీ పీరియాడిక్ మూవీగా రూపొందుతోన్నఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా కంప్లీట్ కాక ముందే సాహో డైరెక్టర్ సుజిత్ తో తర్వాత మూవీ చేస్తున్నట్లు  అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇక రీసెంట్ గా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.

ఈ రెండు సినిమాలతో పాటు మరో మూవీకి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరితో అంటే.. తమిళంలో సముద్రఖని కీలక పాత్రలో నటించి తెరకెక్కించిన మూవీ వినోదాయ సితం. ఇదే సినిమాని తెలుగులో సముద్రఖని దర్శకత్వంలో పవన్ హీరోగా రీమేక్ చేయబోతున్నారు. సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రలో నటించనున్నాడు. త్రివిక్రమ్ పర్యవేక్షణలో ఈ రీమేక్ స్టోరీ డైలాగ్స్ రచయిత సాయి మాధవ్ బుర్రా పూర్తి చేశారట. ఈ మూవీని జనవరిలో ప్రారంభించబోతున్నారని తెలిసింది. మరి.. ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ తో మూవీ, సముద్రఖనితో మూవీ ఈ సినిమాల్లో ముందుగా ఏ సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేస్తారో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular