Saturday, June 13, 2026
Homeసినిమాసోని చేతికి 'బేబీ'ఆడియో హక్కులు

సోని చేతికి ‘బేబీ’ఆడియో హక్కులు

హీరో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటిస్తున్న సినిమా ‘బేబీ’. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ చిత్ర ఆడియో రైట్స్ ను ప్రముఖ ఆడియో కంపెనీ సోనీ సౌత్ మ్యూజిక్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఒక అప్ కమింగ్ స్టార్ హీరో సినిమా ఆడియో రైట్స్ ను ఇంత మొత్తానికి కొనుగోలు చేయడం ఇదే తొలిసారి.

బేబీ సినిమా ఫస్ట్ లుక్ నుంచి ఈ మూవీ పై పాజిటివ్ టాక్ ఉంది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ అయితే.. విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ అనౌన్స్ మెంట్ శనివారం ఉంటుంది. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాని రూపొందించారనే టాక్ ఉంది. దీంతో సినిమాని మరింతగా ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లాలని మేకర్స ప్లాన్ చేస్తున్నారు. మరి.. బేబీ మూవీ ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular