Monday, June 15, 2026
Homeసినిమాబాలయ్య, పరశురామ్ కాంబో సెట్స్ పైకి ఎప్పుడు?

బాలయ్య, పరశురామ్ కాంబో సెట్స్ పైకి ఎప్పుడు?

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘వీరసింహారెడ్డి’ చేస్తున్నారు. మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య చేయనున్నారు. ఇప్పటి వరకు చేయని  ఓ డిఫరెంట్ క్యారెక్టర్  చేస్తున్నారు. బాలయ్యకు కూతురుగా పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల నటిస్తుంది.

అయితే.. ఈ సినిమా తర్వాత బాలయ్య చేయబోతున్న సినిమా పై కూడా అప్పుడే చర్చ మొదలు అయ్యింది. తాజా సమాచారం ప్రకారం… బాలయ్య హీరోగా సర్కారు వారి పాట సినిమాతో విజయం సాధించిన పరశురామ్ ఒక సినిమాను చేయబోతున్నాడు. ఊర్వశివో రాక్షసివో సినిమా ఈవెంట్ లో ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ పరశురామే ప్రకటించాడు. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. ఇటీవల పరశురామ్ కథ రెడీ చేసి బాలయ్యకు వినిపించాడట. కథ నచ్చి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. ఇందులో బాలయ్యను అభిమానులు కోరుకుంటున్నట్టుగా సీఎంగా చూపించబోతున్నాడట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే సంవత్సరం ఏప్రిల్ లేదా మే లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అనిల్ రావిపూడి సినిమా పూర్తి అయినా కాకున్నా వచ్చే ఏడాది సమ్మర్ లోనే సినిమాను మొదలు పెట్టాలని పరశురామ్ తో బాలయ్య అన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో.. బాలయ్యను పరశురామ్ ఎలా చూపిస్తాడు అనేది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular