Saturday, June 13, 2026
Homeసినిమాశంకర్ మూవీలో చరణ్‌ నత్తి క్యారెక్టర్?

శంకర్ మూవీలో చరణ్‌ నత్తి క్యారెక్టర్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. ఈ భారీ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. చరణ్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తుంది. ఇది చరణ్‌ 15వ చిత్రం కాగా, దిల్ రాజు 50వ చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. డైరెక్టర్ శంకర్ ఫస్ట్ టైమ్ తెలుగులో సినిమా చేస్తుండడం, చరణ్‌ ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇందులో చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది. ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి పాత్రలో.. ప్రజంట్ లో కొడుకు పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే.. ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ పాత్రకు నత్తి వుంటుందని సమాచారం. శంకర్ ఈ నత్తి పాత్రని చాలా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలిసింది. నత్తి పాత్రలో ఇటివలే విజయ్ దేవరకొండ లైగర్ లో, ఎఫ్ 3లో వరుణ్ తేజ్ కనిపించారు. ఇప్పుడు చరణ్‌ కూడా నత్తి పాత్ర చేస్తుండడం విశేషం. రంగస్థలంలో చెవిటి పాత్రలో అలరించాడు రామ్ చరణ్. ఇపుడు నత్తి పాత్ర చేయడం మరో ప్రయోగం అని చెప్పచ్చు.

రామ్ చరణ్ నత్తి పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. అనుకున్న విధంగా షూటింగ్ జరగకపోవడం.. మధ్యలో శంకర్ ఇండియన్ 2 షూటింగ్ చేయాల్సి రావడంతో ఈ సినిమా ఆలస్యం అయ్యింది. కొన్ని రోజులు చరణ్‌ మూవీ, మరి కొన్ని రోజులు ఇండియాన్ 2 సినిమా షూటింగ్ లను చేస్తున్నారు శంకర్. ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనేది దిల్ రాజు టార్గెట్. మరి… అనుకున్న విధంగా సమ్మర్ లో రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular