Saturday, June 13, 2026
HomeTrending Newsఇంటర్ పరీక్షల తేదీలు ఖరారు

ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారు

తెలంగాణ ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. వచ్చే ఏడాది (2023) మార్చి 15వ నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2వ తేదీ వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ను జరుపనున్నట్లు వివరించింది.

ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ ఎగ్జామ్‌ను 2023 మార్చి 4న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షను మార్చి 6న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటల వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు ఎగ్జామ్స్‌ విభాగం జాయింట్‌ సెక్రెటరీ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular