ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప వరల్డ్ వైడ్ గా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. దీనితో పుష్ప 2 పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవలే షూటింగ్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత దుబాయ్ లో షూటింగ్ చేయనున్నారు.

అయితే… పుష్ప 2 లో ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటించనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనిపై  ఆరా తీస్తే… పుష్ప 2 లో ఓ గిరిజన యువతి పాత్ర ఉందట. ఇప్పుడు ఈ పాత్రలో సాయి పల్లవి అయితే బాగుంటుందని అనుకుంటున్నారట మేకర్స్.  ఒకవేళ సాయి పల్లవి ఈ పాత్రలో నటించకపోతే.. ఈ పాత్ర కోసం ఐశ్వర్య రాజేష్ ను తీసుకోవాలి అనేది మేకర్స్ ప్లాన్. మరి పుష్ప 2 లో గిరిజన యువతిగా సాయిపల్లవి నటిస్తుందా..? ఐశ్వర్య రాజేష్ నటిస్తుందా..? అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే.. ఎవరు ఎన్ని అంచనాలతో వచ్చినా పుష్ప 2 మాత్రం అంతకు మించి అనేట్టు ఉంటుందట. మరి.. పుష్ప 2 ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *