Tuesday, September 24, 2024
HomeTrending Newsరాష్ట్రపతి భద్రాచలం పర్యటనపై మంత్రి పువ్వాడ సమీక్ష

రాష్ట్రపతి భద్రాచలం పర్యటనపై మంత్రి పువ్వాడ సమీక్ష

భద్రాచలం శ్రిరామచంద్రుడి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా, పరమానందభరితంగా నిర్వహించాలని అందుకు తగ్గ ఎర్పాట్లు చేయలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులకు సూచించారు. ముక్కోటి ఏర్పాట్లు, 28వ తేదిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనపై కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ అనుదీప్ గారి అధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి పువ్వాడ మాట్లాడారు. అలయంకు వచ్చిన భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని, ప్రత్యేక కూలైన్లు, భక్తులు సేదతీరేందుకు షామియానాలు కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా జనవరి 1వ తేదిన సాయంత్రం తెప్పోత్సవం, 2వ తేదీ ఉత్తర ద్వారా దర్శనం రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అందుకు తగ్గ ఏర్పాట్లు పటిష్ట పరచాలన్నరు.

ఆలయం చుట్టూ వాహనాల పార్కింగ్‌ను అనుమతించకూడదని, అందుకు ప్రత్యేకంగా పార్కింగ్ ఎర్పాటు చేసి సూచిక బోర్డులు ఎర్పాటు చేయాలన్నారు. వీధులలో భక్తులు నడిచి వెళ్ళి స్వామివారిని సులువుగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. ప్రతియేటా ముక్కోటి ఏకాదశికి సుమారు లక్షమందికి పైగా భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారని, ఆ సందర్భంగా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగుకుండా ఉండేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని, ఆగమ పండితులు సూచించిన మేరకు ఖచ్చితమైన వేళలు పాటించాలని కోరారు. ఆలయాలను పుష్పాలు, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు ఇతర ఇంజినీరింగ్ ఏర్పాట్లు, మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరారు.

లడ్డు ప్రసాదాలు, తాగునీటి వసతి కల్పించాలని సూచించారు. భద్రతాపరంగా ఇబ్బందులు లేకుండా స్థానిక పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా ఆలయాల్లో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించాలని, భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా హెల్ప్ డెస్కులు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్థానిక అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకొని అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు సేవలు అందించేందుకు సంభందిత సిబ్బందిని ఎర్పాటు చేయలని, భక్తుల కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది పరిమిత సంఖ్యలో వీఐపీల మధ్య నిరాడంబరంగా నిర్వహించాల్సి వచ్చిందని, ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది వేలాది భక్తుల నడుమ అంగరంగవైభవంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రపతి పర్యటనకు భద్రత పెంచాలి. ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 28న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి భద్రాచలం పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ను మంత్రి పువ్వాడ అదేశించారు. భద్రత, వసతి, వైద్యం ఇతర ఏర్పాట్ల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, కలెక్టర్, ఎస్పీ స్వయంగా పర్యవేక్షణ చేయలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్