ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించినా తాలిబాన్ల వైఖరిలో మార్పు రావటం లేదు. అఫ్ఘానిస్థాన్‌లో శాంతి నెలకొంటోంది అనే సమయంలో తాలిబన్లు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు మహిళలపై కఠిన ఆంక్షలు కొనసాగిస్తున్నారు. పురుషులు వెంట లేకుండా మహిళలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి వీల్లేదని, బాలికల సెకండరీ స్కూళ్లు మూసివేయాలని, మహిళలు ఉద్యోగాలు చేయకూడదంటూ ఆదేశాలు జారీచేసిన తాలిబన్‌ పాలకులు తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. దేశంలో మహిళలకు యూనివర్సిటీ విద్యపై నిషేధం విధించారు. మహిళలకు విద్యాబోధనను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలకు ఉన్నత విద్యాశాఖ మంత్రి నేదా మహమ్మద్‌ నదీమ్‌ లేఖ రాశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఆజ్ఞాపించారు.

తాలిబన్ల నిర్ణయంపై అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. మహిళలకు యూనివర్సిటీ విద్యపై నిషేధం విధించడం, బాలికల సెకండరీ స్కూల్‌ మూసివేయడం, మహిళలు, బాలికలపై ఆంక్షలు విధించడం వంటివి వారి హక్కులు, స్వేచ్ఛను హరించడమేనని అమెరికా హోం శాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళల హక్కులను ఇది కాలరాయడమేనని ఐక్యరాజ్య సమితిలో బ్రిటన్ రాయబారి బార్బరా వుడ్ వార్డ్ అన్నారు. మహిళలకు యూనివర్సిటీ విద్యను దూరంచేస్తూ తాలిబన్లు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు.

Also Read : తాలిబాన్ల ఏలుబడిలో ఆఫ్ఘన్లో దుర్భిక్షం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *