Saturday, June 13, 2026
Homeసినిమాఆ రెండూ కలిస్తే 'వీరసింహారెడ్డి' : మలినేని గోపీచంద్

ఆ రెండూ కలిస్తే ‘వీరసింహారెడ్డి’ : మలినేని గోపీచంద్

గాడ్ అఫ్ మాసస్ నందమూరి బాలకృష్ణ,  గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్నమూవీ ‘వీరసింహారెడ్డి’ జనవరి 12, 2023న సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఆల్బమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.  ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్  సింగిల్ జై బాలయ్య, సెకండ్ సింగిల్ సుగుణ సుందరి మంచి హిట్స్ గా నిలిచాయి.

ఇప్పుడు ‘ది సెన్సేషనల్ స్పెషల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ ‘మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి’  పాటతో వచ్చారు  మేకర్స్. ఇలాంటి పాటలను మంచి అనుభవం కోసం పెద్ద స్క్రీన్ పై చూడాలి. అందుకే  పాటను సంధ్య 35 MM లో గ్రాండ్ గా లాంచ్ చేసారు మేకర్స్. భారీగా హాజరైన అభిమానుల తోనే పాటని గ్రాండ్ గా విడుదల చేయించింది చిత్ర యూనిట్.  రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను  సాహితీ చాగంటి, యామిని, రేణు కుమార్ లు  అలపించారు.

దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. జనవరి 12 నుండి థియేటర్ లో జై బాలయ్య అనే నినాదం మ్రోగుతూనే వుంటుంది. ఇప్పుడు చూసిన సాంగ్ జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇందులో ఒక సిగరెట్ స్టెప్ , సోడా స్టెప్ వుంటుంది. మాములుగా వుండదు. ఇప్పుడు అన్నపూర్ణలో జరుగుతున్న సాంగ్ కూడా మాములుగా వుండదు. ఫ్యాన్స్ కి పండగే. ఒక సమరసింహా రెడ్డి, నరసింహానాయుడు వైబ్రేషన్ ఎలా వుంటుందో వీరసింహారెడ్డి అలా వుంటుంది. థియేటర్ లో ఎవరూ సీట్లలో కూర్చోరు. భీవత్సంగా వుంటుంది. జనవరి 12న వస్తున్నాం. రెడీగా వుండండి తమ్ముళ్ళు” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular