Thursday, September 19, 2024
HomeTrending Newsప్రధాని మోడీ తల్లి హీరాబెన్ కన్నుమూత

ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ కన్నుమూత

ప్రధాని నరేంద్ర మోడీకి మాతృవియోగం కలిగింది. మోడీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని యు.ఎన్‌.మెహతా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న హీరాబెన్‌ ఆరోగ్యం విషమించడంతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇటీవలే హీరాబెన్ 100వ పుట్టినరోజు జరుపుకున్నారు.

అనారోగ్యంతో బాధపడుతున్న హీరాబెన్ బుధవారం ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ప్రధాని మోడీ.. హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి తన తల్లితో మాట్లాడారు. దాదాపు గంటన్నర సేపు ఆమె వద్దే ఉన్నారు. ఆ తర్వాత ఢీల్లికి వెళ్లారు. మాతృమూర్తి మరణంతో ప్రధాని మోడీ  ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌ బయల్దేరారు. హీరాబెన్‌ మృతిపై దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

ఈ ఏడాది జూన్ లో హీరాబెన్ శత వసంతంలోకి అడుగుపెట్టారు. ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారు. పోలింగ్ కు ముందు మోడీ తన తల్లిని కలిసి ఆమెతో కొంత సమయం గడిపారు. తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. మాతృమూర్తి హీరాబెన్‌ కన్నుమూతపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావోద్వేగ ట్వీట్‌ చేశారు. ‘‘నా తల్లి వందేళ్ల జీవితాన్ని పూర్తి చేసుకుని దేవుడి చెంతకు చేరారు. ఆమె జీవిత ప్రయాణం ఓ తపస్సులాంటిది. సన్యాసిలా, కర్మయోగిలా, విలువలకు కట్టుబడిన వ్యక్తిలా నిస్వార్థ జీవితాన్ని గడిపారు. ఆమెలో త్రిమూర్తులు ఉన్నట్లు భావిస్తున్నా’’ అని ప్రధాని మోడీ ట్విటర్‌లో తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్