పాకిస్తాన్-న్యూ జిలాండ్ మధ్య రెండో టెస్ట్ నేడు కరాచీలో మొదలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే సెంచరీ తో రాణించాడు. తొలి వికెట్ కు కాన్వే- లాథమ్ లు 134 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టామ్ లాథమ్ 71 పరుగులు చేసి ఔట్ కాగా, కాన్వే122 రన్స్ సాధించి రెండో వికెట్ గా వెనుదిరిగాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్-36; హెన్రీ నికోలస్ -26 పరుగులు సాధించారు. డెరిల్ మిచెల్ 3 మాత్రమే చేయగా, మైఖేల్ బ్రాస్ వెల్ డకౌట్ అయ్యాడు.
టామ్ బ్లాండెల్-30; ఇష్ సోది-11 పరుగులతో క్రీజులో ఉన్నారు.
పాకిస్తాన్ బౌలర్లలో ఆఘా సల్మాన్ 3; నషీమ్ షా 2; అబ్రార్ అహ్మద్ 1 వికెట్ సాధించారు.