Monday, June 15, 2026
Homeసినిమా'పుష్ప 2' టీజర్ వస్తుందా..?

‘పుష్ప 2’ టీజర్ వస్తుందా..?

అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా దాదాపు 400 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ‘పుష్ప 2‘ మూవీ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల పుష్ప 2 మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. తాజా షెడ్యూల్ ను జనవరి 7 నుంచి హైదరాబాద్ లో భారీగా ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

అయితే.. ఇంత వరకు పుష్ప 2 షూటింగ్ ఎప్పుడు పూర్తి చేస్తారు..?  అలాగే సినిమా ఎప్పుడు వస్తుంది అని వివరాలు ఏవి కూడా ఇంకా చెప్పలేదు. ఇక అల్లు అర్జున్ కూడా ఈ సినిమా షూటింగ్ కోసం వీలైనంత ఎక్కువ సమయం తీసుకునే పూర్తి చేయాలని అనుకుంటున్నాడట. ఎందుకంటే.. పుష్ప మొదటి భాగానికి సంబంధించిన పొరపాట్లు మళ్లీ జరగకుండా చూసుకోవాలని కూడా ఆలోచిస్తున్నారు. ఇక పుష్ప 2 అప్ డేట్ ఏంటంటే… అవతార్ 2 సినిమా విడుదలతో పాటు పుష్ప 2 సినిమాకు సంబంధించిన ఒక ఫస్ట్ గ్లిమ్స్ కూడా విడుదల చేయాలని అనుకున్నారు కానీ.. కుదరలేదు.

ఇక న్యూయార్ కైనా అప్ డేట్ ఇస్తారేమో అనుకుంటే అప్పుడు కూడా ఇవ్వలేదు. ఇక ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ లో మాత్రం తప్పకుండా పుష్ప 2 సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇవ్వాలని సుకుమార్ డిసైడ్ అయినట్లుగా సమాచారం. అన్ని భాషల వారికి కనెక్ట్ అయ్యే విధంగా అదిరిపోయేలా ఒక ఫస్ట్ గ్లింప్స్ రెడీ చేసినట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది. మరి.. ఇది ఎంత వరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular