చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి స్పీడు పెంచి వరుసగా సినిమాలు చేస్తున్నారు. తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చేశారు. ఇక అక్కడ నుంచి ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ చిత్రాలు వరుసగా చేశారు. ఇప్పుడు సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆతర్వాత ఉగాదికి ‘భోళా శంకర్’ మూవీతో రానున్నారు. మూవీలో చిరంజీవికి జంటగా తమన్నా నటిస్తుంటే.. చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ మూవీకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత చిరంజీవి ఎవరితో సినిమా చేయనున్నారనేది ప్రకటించలేదు. ఇటీవల చిరు నెక్ట్స్ మూవీ పూరితో కన్ ఫర్మ్ అయ్యిందని వార్తలు వచ్చాయి. అలాగే చిరుతో సినిమా చేసేందుకు మారుతి కూడా స్టోరీ రెడీ చేశారు. అలాగే ప్రశాంత్ నీల్ కూడా చిరంజీవి కోసం పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేశారని టాక్ వినిపిస్తోంది. తాజా వార్త ఏంటంటే.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసేందుకు ప్రభుదేవా ఓ కథ రెడీ చేశారట. ఇటీవల గాడ్ ఫాదర్ మూవీలోని చిరు, సల్మాన్ సాంగ్ కు ప్రభుదేవా కొరియోగ్రఫి చేశారు.

మళ్లీ చిరు ప్రభుదేవా దర్శకత్వంలోనే మరో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. అయితే గత కొంతకాలంగా చూసుకుంటే ప్రభుదేవా ట్రాక్ రికార్డ్ అంత సక్సెస్ ఫుల్ గా ఏమీ లేదు. అతను కూడా చాలా రొటీన్ కమర్షియల్ సినిమాలు చేస్తున్నాడు అనే విధంగా కామెంట్స్ వచ్చాయి. అయినప్పటికీ చిరు, ప్రభుదేవా కాంబో ఫిక్స్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. మరి.. వార్తల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వస్తుందో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *