Monday, June 15, 2026
Homeసినిమావీరమల్లు సమ్మర్ కి రావడం లేదా..?

వీరమల్లు సమ్మర్ కి రావడం లేదా..?

పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరి హర వీరమల్లు’. క్రిష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న వీరమల్లు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా ఆలస్యం అవ్వడంతో ఎట్టి పరిస్థతుల్లోనూ వీరమల్లు షూటింగ్ పూర్తి చేయాల్సిందే అని పవర్ స్టార్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. అందుకనే ఈ మూవీకి కంటిన్యూగా డేట్స్ ఇచ్చారు. ఏ.ఎం.రత్నం ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అయితే.. ఈ భారీ పీరియాడిక్ మూవీని సమ్మర్ కి రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు కానీ.. ఇప్పుడు వీరమల్లు సమ్మర్ కి రావడం కష్టమే అని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే… తాజాగా నిర్మాత ఏఎం రత్నం ఓ ఇంటర్వ్యూలో వీరమల్లు సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నాం కానీ అనుకున్నట్టుగా సమ్మర్ లో రిలీజ్ చేయడం కుదురుతుంతో లేదో చెప్పలేం అన్నట్టుగా ఓ హింట్ అందించాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించి నిర్మాత ఏఎం రత్నం ఇలా అని ఉండొచ్చు కానీ ఏదేమైనా హరి హర వీర మల్లు చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు.

సమ్మర్ కి పోటీ గట్టిగా ఉంది. ఇప్పటి నుంచే సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్నారు. వీరమల్లు రిలీజ్ డేట్ ను ముందుగా ప్రకటించే పరిస్థితి లేదు. ఎందుచేతనంటే.. ఎప్పుడు షూటింగ్ పూర్తవుతుందో..? ఎప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కంప్లీట్ అవుతుందో క్లారిటీ లేదు. అందుచేత వీరమల్లు సమ్మర్ కి రావడం కష్టమే. కాకపోతే సమ్మర్ మిస్ అయితే.. దసరాకి ఈ సినిమాను రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని సమాచారం. పవర్ స్టార్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అయిన వీరమల్లు మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి.. పాన్ ఇండియా రేంజ్ లో పవర్ స్టార్ ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular