బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ 2’ టాక్ షోకి విపరీతమైన క్రేజ్ ఉంది. క్రితం వారం ఈ టాక్ షోలో ప్రభాస్ – గోపీచంద్ పాల్గొన్నారు. ప్రభాస్ కీ .. గోపీచంద్ కి మధ్య చాలా కాలం నుంచి స్నేహం ఉంది. ఇద్దరూ సినిమాల్లోకి రావడానికి ముందు నుంచే మంచి స్నేహితులు. అందువలన ఇద్దరినీ ఈ టాక్ షోకి ఆహ్వానించారు. ఇద్దరితోను కలిసి బాలయ్య సందడి చేశారు.

ప్రభాస్ ఫస్టు ఎపిసోడ్ కి అనూహ్యమైన రీతిలో రెస్పాన్స్ వస్తుండగా, పార్టు 2ను స్ట్రీమింగ్ చేయడానికి టీమ్ రెడీ అవుతోంది. పార్టు 2 ఈ నెల 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో పార్టు 2కి సంబంధించిన ప్రోమోను వదిలారు. ఈ ప్రోమో ఇప్పుడు రన్ అవుతోంది. ఈ ఎపిసోడ్ మరింత రసవత్తరంగా నడిచినట్టు ప్రోమోను బట్టి తెలుస్తోంది

ప్రభాస్ కి సంబంధించి ఆయన చెప్పని విషయాలను గోపీచంద్ ద్వారా రాబట్టడానికి బాలకృష్ణ ట్రై చేశారు.  చెప్పడానికి గోపీచంద్ కూడా రెడీ అయ్యాడు. అయితే ”చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పు .. సగం .. సగం చెప్పొద్దూ” అంటూ గోపీచంద్ కి వార్నింగ్ ఇచ్చే తరహాలో చూపుడు వ్రేలు చూపిస్తూ ప్రభాస్ మాట్లాడాడు. దాంతో “నా ముందే వార్నింగులు వద్దమ్మా” అంటూ బాలకృష్ణ అన్నారు. అందుకు ప్రభాస్ ఏదో ఆన్సర్ ఇవ్వడంతో, ‘ఏంటి నాకే ట్విస్టా? అంటూ నవ్వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *