Friday, June 12, 2026
Homeసినిమాచైతు.. నెక్ట్స్ ఏంటి..?

చైతు.. నెక్ట్స్ ఏంటి..?

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ‘కస్టడీ’ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ్ లో రూపొందుతోన్న ఈ భారీ యాక్షన్ మూవీలో నాగచైతన్యకు జంటగా ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి నటిస్తుంది. అరవింద్ స్వామి విలన్ రోల్ చేస్తుంటే.. ప్రియమణి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో నాగచైతన్య పోలీస్ కానిస్టేబుల్ క్యారెక్టర్ చేస్తుండడం విశేషం. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అండ్ టీజర్ కు అనూహ్య స్పందన వచ్చింది. దీంతో కస్టడీ మూవీ పై మరింత క్రేజ్ పెరిగింది. సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. ఈ సినిమా తర్వాత చైతన్య ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. పరశురామ్ తో సినిమా చేయాలి అనుకున్నాడు కానీ.. ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. మరి.. ఎవరితో చైతన్య నెక్ట్స్ మూవీ ఉంటుంది అనేది బయటకు రాలేదు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. నాగచైతన్య, కిషోర్ తిరుమలతో ఓ సినిమా చేయాలి అనుకున్నారు. ఈ మూవీని ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మించాలి అనుకున్నారు. గతంలో ఈ ప్రాజెక్ట్ గురించి వార్తలు వచ్చాయి కానీ.. ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. మేటర్ ఏంటంటే.. కిషోర్ తిరుమల చైతన్య కోసం స్టోరీ రెడీ చేశాడట. త్వరలోనే నెరేషన్ ఇవ్వనున్నాడని తెలిసింది. మరి.. చైతు.. కిషోర్ తిరుమలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular