కందుకూరు, గుంటూరు ఘటనలను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం దీనిపై జ్యూడిషియల్ ఎంక్వైరికి ఆదేశించింది. నెలరోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది. ఏపీ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గత నెల డిసెంబర్ 28 న నెల్లూరు జిల్లా కందుకూరులో రోడ్ షో నిర్వహించారు.  చంద్రబాబు తన వాహనం నుండి ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో మొత్తం 8 మంది మరణించారు.

ఈ ఘటన జరిగిన మూడు రోజులకే జనవరి 1న గుంటూరు వికాస్ నగర్ లో టిడిపి ఎన్ ఆర్ ఐ విభాగం=ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన చంద్రన్న కానుక- జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు ఈ సభలో పాల్గొని ప్రసంగించి వెళ్ళిపోయిన అనంతరం చీరల కోసం ఒక్కసారిగా అక్కడకు వచ్చిన మహిళలు ఎగబడడంతో తొక్కిసలాట జరిగి మొత్తం ముగ్గురు మహిళలు మృత్యువాత పడ్డారు. ఈ రెండు సంఘటనల తర్వాత ప్రభుత్వం జీవో నంబర్ 1 ను తీసుకు వచ్చింది. రోడ్ల పై బహిరంగ సభలు పెట్టుకోవడాన్ని నిషేధించింది. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాయి.

ఈ సందర్భంలోనే ప్రభుత్వం కందుకూరు, గుంటూరు ఘటనలపై  రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషశయన రెడ్డితో విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసింది.  తొక్కిసలాటకు దారి తీసిన పరిస్థితులు, బాధ్యుల పై విచారణ చేయనున్న కమిషన్.. నెలరోజుల్లో ఓ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *