Thursday, June 18, 2026
Homeస్పోర్ట్స్Malaysia Open: సెమీస్ కు సాత్విక్-చిరాగ్ జోడీ

Malaysia Open: సెమీస్ కు సాత్విక్-చిరాగ్ జోడీ

భారత స్టార్ బాడ్మింటన్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ మలేషియా ఓపెన్ -2023, పురుషుల డబుల్స్ లో సెమీ ఫైనల్స్ కు చేరుకొని ఒక పతకం ఖాయం చేశారు. నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో చైనా ద్వయం లియు యు చెన్- ఓయు యోవాన్ యి పై 17-21; 22-20; 21-9 తేడాతో విజయం సాధించారు. మొదటి సెట్ కోల్పోయినా స్థైర్యం కోల్పోకుండా హోరాహోరీగా సాగిన రెండో సెట్ ను సొంతం చేసుకున్నారు. మూడో సెట్ లో ఏకపక్షంగా ప్రత్యర్థి జోడీపై పైచేయి సాధించి గెలుపొందారు.

కాగా, పురుషుల సింగిల్స్ మ్యాచ్ లో హెచ్ ఎస్ ప్రణయ్ ఓటమి పాలయ్యాడు, జపాన్ క్రీడాకారుడు కొడాయ్ నరవోకా 21-16; 19-21; 21-10 తేడాతో  ప్రణయ్  పై గెలుపొంది సెమీస్ చేరుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular