రాష్ట్రవ్యాప్తంగా ఎల్లుండి (బుధవారం) నుంచి పగటి పూట కూడా పాక్షిక కర్ఫ్యూ అమల్లో వుంటుంది. కోవిడ్‌పై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు షాపులు తెరిచేందుకు అనుమతించాలని, ఆ తర్వాత అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలో రాత్రి 9 గంటల నుంచి మర్నాడు ఉదయం 5 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ అమల్లో వుంది. కోవిడ్ తీవ్రత దృష్ట్యా పగలు కూడా ఆంక్షలు విధించారు.
ఈ తాజా ఆంక్షలు రెండు వారాల పాటు ఆంక్షలు అమల్లో వుంటాయి. షాపులు తెరిచి ఉంచే సమయంలోనూ 144వ సెక్షన్ అమల్లో వుంటుంది.