Thursday, March 19, 2026
Homeస్పోర్ట్స్FIH Odisha Hockey: మలేషియా, నెదర్లాండ్స్ విజయం

FIH Odisha Hockey: మలేషియా, నెదర్లాండ్స్ విజయం

పురుషుల హాకీ ప్రపంచ కప్ లో పూల్ ‘సి’ జట్లు మలేషియా- చిలీ జట్ల మధ్య రూర్కెలా బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంలో  నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో మలేషియా 3-2 తేడాతో విజయం సాధించింది.

ఆట తొలి పావు భాగంలో ఇరు జట్లూ గోల్ చేయలేదు. రెండో పావు భాగం 20వ నిమిషం వద్ద పేనాల్టీ కార్నర్ ద్వారా తొలి గోల్ సాధించింది.  26వ నిమిషంలో మలేషియా పేనాల్టీ స్ట్రోక్ ద్వారా గోల్ సాధించింది స్కోరు సమం చేసింది. 29వ నిమిషం వద్ద చిలీ మరో ఫీల్డ్ గోల్ సాధించి 2-1ఆధిక్యంలోకి వెళ్ళింది. 41, 42 నిమిషాల్లో మలేషియా రెండు గోల్స్ చేసి 3-2తో చిలీపై ఆధిక్యం సంపాదించింది. చివరి పావు భాగంలో కూడా రెండు జట్లూ మెరుగైన ప్రదర్శన చేసినా గోల్ మాత్రం చేయలేకపోయాయి.

మలేషియాకు మూడో గోల్ అందించిన సుమంత్రి కి ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

ఇదే స్టేడియంలో జరిగిన మరో మ్యాచ్ లో 3-1 తేడాతో న్యూజిలాండ్ పై నెదర్లాండ్స్ ఘనవిజయం సాధించింది. ఆట మూడోనిమిషంలోనే ఫీల్డ్ గోల్ చేసి డచ్ జట్టు బోణీ కొట్టింది. 13, 20, 55 నిమిషాల వద్ద మరో మూడు గోల్స్ సాధించింది.

థియరీ బ్రింక్మన్  కి ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular