Sunday, November 24, 2024
Homeసినిమాపవన్ తో అవకాశం వచ్చినా నటించనంటున్న హీరోయిన్

పవన్ తో అవకాశం వచ్చినా నటించనంటున్న హీరోయిన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ తో ఒక్క సినిమా అయినా చేయాలి అనుకుంటుంటారు హీరోయిన్స్.  ఆయనతో కలిసి నటించడం డ్రీమ్ అనే విషయాన్ని చాలా ఇంటర్ వ్యూల్లో చెప్పడం జరిగింది. అయితే.. ఓ హీరోయిన్ మాత్రం పవన్ కళ్యాణ్ తో నటించే ఛాన్స్ వచ్చినా నటించను అంటుంది. ఇంతకీ.. ఎవరా హీరోయిన్ అంటారా..? టాక్సీవాలా సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించి మెప్పించిన ప్రియాంక జవాల్కర్.

ఇంతకీ విషయం ఏంటంటే… టాక్సీవాలా సినిమా సక్సెస్ సాధించినప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో చిన్న సినిమాలో నటిస్తూ బండి నెట్టుకొస్తోంది. అయితే.. ఏకంగా పవన్ సినిమాలో చాన్స్ వచ్చినా చేయను అనడానికి బలమైన కారణమే ఉందని ప్రియాంక చెబుతోంది. ఏంటంటే… తనకు పవన్ కళ్యాణ్‌ అంటే పిచ్చి అని, ఆయన నటించిన తమ్ముడు సినిమాను 20 సార్లు చూశానని చెప్పింది. అంతే కాకుండా… ఖుషీ సినిమాలో ప్రతీ డైలాగ్ కూడా తనకు గుర్తుంది అంటోంది. అంతలా అభిమానించే పవన్ ను దూరం నుంచి చూస్తూ, అభిమానిస్తూ ఉండిపోవాలని అనుకుంటున్నట్టు తెలిపింది.

అంతకు మించి ఏమీ కోరుకోవడం లేదని, ఒకవేళ ఆయన సినిమాలో అవకాశం వచ్చినా చేయనని చెప్పింది. అంత పెద్ద స్టార్‌ అయినా కూడా పవన్ అంత సింపుల్‌గా ఎలా ఉంటారో తనకు అర్థం కాదని చెప్పింది. అభిమాని అయితే.. ఒకసారి అయినా పవన్ తో నటించాలి అనుకుంటారు.. ప్రియంక ఏంటో నటించనని చెబుతుంది అనే కామెంట్లు వస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్