Friday, April 19, 2024
Homeసినిమాబాలయ్యతో అల్లు అరవింద్ భారీ ప్లాన్

బాలయ్యతో అల్లు అరవింద్ భారీ ప్లాన్

నట సింహం నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ అంటూ టాక్ షో చేయడం.. ఆ టాక్ షో సూపర్ సక్సెస్ అవ్వడం తెలిసిందే. అయితే.. మెగా కాంపౌండ్ లోని అల్లు అరవింద్.. బాలయ్యతో టాక్ షో చేయడం అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యింది. చిరు, అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగిందని అందుకనే  బాలయ్యతో టాక్ షో ప్లాన్ చేశారని వార్తలు వచ్చాయి. అయితే.. ఇదే విషయం గురించి చిరంజీవిని అడిగితే.. అలాంటిది ఏమీ లేదు. మేము బాగానే ఉన్నాం. ఎవరో తెలియని వాళ్లు ఏదో రాస్తుంటారు. అందులో వాస్తవం లేదని ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో చెప్పారు.

ఇదిలా ఉంటే.. బాలయ్యతో టాక్ షో చేసిన అల్లు అరవింద్.. ఇప్పుడు బాలయ్యతో గీతా ఆర్ట్స్ సంస్థలో భారీ చిత్రం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ తో బింబిసార అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందించిన మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా ప్లాన్ చేసిందని టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి గీత సంస్థ ప్రస్తుతానికి సినిమాలు చేయడం లేదు ఒక బడా ప్రాజెక్టు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం చేస్తున్న చిన్న సినిమాలన్నీ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీదే చేస్తున్నారు.

కొంత గ్యాప్ రావడంతో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయాలని భావిస్తున్నారట అల్లు అరవింద్. అది బాలకృష్ణ తోనే సెట్ చేసుకున్నారని అంటున్నారు. బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ ఇచ్చి సినిమా చేసేందుకు అల్లు అరవింద్ రంగం సిద్ధం చేశారు అని ప్రచారం జరుగుతోంది. మరో వైపు పరశురామ్ కూడా బాలకృష్ణ కోసం కథ రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా గీతా సంస్థ నిర్మింనుందని వార్తలు వచ్చాయి. మొత్తానికి గీతా సంస్థ బాలయ్యతో సినిమా చేయడం పక్కా. అయితే.. ఈ భారీ, క్రేజీ మూవీ వశిష్ట్ డైరెక్షన్ లో ఉంటుందా..? పరశురామ్ డైరెక్షన్ లో ఉంటుందా..? అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్